రేపు(అక్టోబర్ 27) హైదరాబాద్లోని ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్

రేపు(అక్టోబర్ 27) హైదరాబాద్లోని ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో భాగంగా ప్యారడైజ్ జంక్షన్ వద్ద 800 మి.మీ డయా ఎంఎస్ పైప్‌లైన్ విస్తరణ పనులను హెచ్ఎండీఏ చేపట్టనుంది. ఈ క్రమంలో మారేడ్‌పల్లి నుంచి కంట్రోల్ రూమ్ వరకు ఎంఎస్ పైప్​లైన్​ను స్పోర్ట్స్ గ్రౌండ్, లీ-రాయల్ జంక్షన్, బాలంరాయి వద్ద అనుసంధానం చేసే పనులు ఈ నెల 27న మధ్యాహ్నం 12 గంటల నుంచి 28 ఉదయం 6 గంటల వరకు 18 గంటల పాటు కొనసాగనున్నాయి. ఈ సమయంలో నల్లగుట్ట, ప్రకాశ్ నగర్, మేకలమండి, భోలక్​పూర్, హస్మత్​పేట తదితర ప్రాంతాలు, సౌత్ సెంట్రల్ రైల్వే, బేగంపేట విమానాశ్రయం, బాలంరాయి పంప్​హౌస్ వంటి ప్రదేశాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.