మహిళా లోకానికి నిర్మలమ్మ బడ్జెట్ భరోసా.. షీ-మార్ట్స్, లక్షాధికారి దిదీలకు వరాలు

మహిళా లోకానికి నిర్మలమ్మ బడ్జెట్ భరోసా.. షీ-మార్ట్స్, లక్షాధికారి దిదీలకు వరాలు

కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళా లోకానికి భారీ ఊరటనిస్తూ.. వారిని కేవలం పథకాల లబ్ధిదారులుగా కాకుండా బిజినెస్ ఓనర్లుగా మార్చే సరికొత్త వ్యూహాన్ని ప్రకటించారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్రను పెంచుతూ మహిళా నేతృత్వంలోని అభివృద్ధి అనే నినాదంతో కీలక పథకాలను ప్రభుత్వం ఆవిష్కరించింది.

గ్రామీణ మహిళల జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపజేసిన ‘లక్షాధికారి దిదీ’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత బలోపేతం చేసింది. గతంలో ఉన్న 2 కోట్ల లక్ష్యాన్ని 3 కోట్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఇప్పటికే సత్ఫలితాలను ఇస్తోంది. ఇప్పుడు ఈ పథకాన్ని కేవలం రుణాలకే పరిమితం చేయకుండా.. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను స్థిరమైన పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యంగా కొత్త నిధులు కేటాయించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

ఈసారి బడ్జెట్‌లో అత్యంత క్రేజీ ప్రకటన ‘షీ-మార్ట్స్’ అని చెప్పుకోవచ్చు. మహిళలు తయారు చేసిన వస్తువులను విక్రయించడానికి దళారీల ప్రమేయం లేకుండా.. క్లస్టర్ స్థాయి ఫెడరేషన్ల ద్వారా ‘కమ్యూనిటీ ఓన్డ్ రిటైల్ అవుట్‌లెట్స్’ స్థాపించనున్నారు. అంటే మహిళా సంఘాలే ఈ షోరూమ్‌లకు యజమానులుగా ఉండి.. మార్కెట్ ధరలను నియంత్రిస్తాయి. దీనివల్ల గ్రామీణ ఉత్పత్తులకు బ్రాండింగ్ రావడంతో పాటు మహిళల ఆదాయం భారీగానే పెరగనుంది.

ALSO READ :  బడ్జెట్ 2026 ఎఫెక్ట్ : ఐఫోన్, శామ్‌సంగ్ సహా స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గుతాయా ?

ఉన్నత చదువుల్లో అమ్మాయిల భాగస్వామ్యాన్ని పెంచేందుకు, ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ రంగాల్లోని విద్యార్థినుల కోసం ప్రభుత్వం దేశంలోని ప్రతి జిల్లాలో ఒక మహిళా హాస్టల్‌ను నిర్మించనున్నట్లు ఈ బడ్జెట్లో ప్రకటించింది. ప్రయోగశాలల్లో ఎక్కువ సమయం గడపాల్సిన విద్యార్థినులకు ఇది ఎంతో ఉపయోగపడనుంది.

బడ్జెట్ 2026లో మహిళల కోసం 10 ప్రధాన ముఖ్యాంశాలు:

* లక్షాధికారి దిదీ: స్థిరమైన వ్యవస్థాపకత వైపు ప్రయాణం.
-* షీ-మార్ట్స్: కమ్యూనిటీ నేతృత్వంలోని రిటెయిల్ అవుట్‌లెట్లు.
* మార్కెట్ యాక్సెస్: మహిళా ఉత్పత్తులకు నేరుగా విదేశీ, స్వదేశీ మార్కెట్లతో అనుసంధానం.
* నైపుణ్య శిక్షణ: ఆధునిక వ్యాపార మెళకువల్లో శిక్షణ.
* మహిళా హాస్టల్స్: ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున నిర్మాణం.
* డిజిటల్ సాధికారత: ఐటీ అండ్ డిజిటల్ మార్కెటింగ్‌లో మహిళలకు ప్రాధాన్యత.
* ఆర్ధిక తోడ్పాటు: ఈక్విటీ, ఇన్నోవేటివ్ ఫైనాన్సింగ్ సదుపాయం.
* క్లస్టర్ డెవలప్‌మెంట్: 200 పాత క్లస్టర్ల పునరుద్ధరణలో మహిళల పాత్ర.
* ఆరెంజ్ ఎకానమీ: గేమింగ్, యానిమేషన్‌లో మహిళలకు ఉద్యోగావకాశాలు.
* ఆయుష్ కేంద్రాలు: మహిళా ఆరోగ్య నిపుణుల కోసం భారీగా ఉపాధి కల్పన.