Budget 2024 : వికసిత్ భారత్ 2047 మోదీ లక్ష్యం

Budget 2024 : వికసిత్ భారత్ 2047 మోదీ లక్ష్యం

2047 నాటికి పేదరికం లేని దేశమే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు కేంద్ర అర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.  ఫిబ్రవరి 1వ తేదీ గురువారం పార్లమెంట్ లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25పై ఆమె ప్రసంగించారు. దేశంలో అవినీతి, కుటుంబ పాలనను అంతం చేశామని చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర పెంచుతూ వచ్చామన్నారు. యువత ఉపాధికి పెద్దపీట వేశమని తెలిపారమె. యువతకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రధాని మోదీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా 92 యూనివర్సిటీలు, 7 ఐఐటీలు నెలకొల్పామని వెల్లడించారు.  

నిర్మలాసీతారామన్ పాయింట్స్:

  • 2014  నుంచి  దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది.
  • పదేళ్లలో అవినీతి గణనీయంగా తగ్గింది.
  • కరోనా సంక్షోభాన్ని దేశం అధిగమించింది.  
  •  ఆత్మనిర్భర్ భారత్ తో ముందుకెళ్తున్నాం.
  • గ్రామాల్లో ఆర్థిక వికాసం సాధ్యమవుతుంది.
  • పీఎం జన్మన్ యోజన కింద గిరిజనులకు ఉపాది కల్పించాం.
  • నూతన సంస్కరణలతో కొత్త పరిశ్రమలొచ్చాయి.
  • ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు కల్పించాం.
  • 78 లక్షల వీధి వ్యాపారులు లబ్ధి పొందారు.
  • మోదీ ప్రభుత్వ పాలనలో 3వేల ఐటీఐలను నెలకొల్పాం.
  • 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు.
  • జన్ ధన్ అకౌంట్ల ద్వారా రూ.34 లక్షల కోట్లు అందించాం.
  • రూ.30 కోట్ల ముద్రాయోజన లోన్లు ఇచ్చాం.
  • మహిళల పేరు మీదనే 70 శాతం ఇండ్లు ఇచ్చాం.
  • మహిళలకు మూడింట ఒకవంతు రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టాం.
  • అన్ని రంగాలపై విశ్వసనీయత కల్పించాం. విశ్వాసంతో కూడిన అడ్మినిస్ట్రేషన్ అందిస్తున్నాం.
  • నాలుగు కోట్ల మంది రౌతులకు బీమా సౌకర్యం కల్పించాం.
  • సమ్మిళిత అభివృద్ధి గ్రామస్థాయికి చేరింది.
  • ఆసియా, పారా గేమ్స్ లో సత్తా చాటాం
  • చెస్ లో ప్రజ్ఞానంద అద్భుత ప్రదర్శన చేశారు.
  • క్రీడల్లో విజయాలు ఆత్మస్థైర్యాన్ని పెంచాయి.
  • యువతకు పెద్దపీఠ వేస్తూ వస్తున్నాం
  • దేశ ప్రజల ఆదాయం 50 శాతం పెరిగింది. 
  • రికార్డు స్థాయిలో మౌలిక వసతులను కల్పించాం
  •  అన్ని ప్రాంతాల్లో ఆర్థిక వృద్ధి కనిపిస్తోంది
  • 2047నాటికి పేదరికం లేని దేశమే లక్ష్యం