కేంద్ర బడ్జెట్ సెషెన్ కు ఆమోదం.. జూలై 23న పార్లమెంట్లో

కేంద్ర బడ్జెట్ సెషెన్ కు ఆమోదం.. జూలై 23న పార్లమెంట్లో


జూలై 22 నుంచి కేంద్ర  బడ్జెట్ సమావేశాలు ప్రారంభం  కానున్నాయి. జూలై 23న పార్లమెంట్ లో 2024-25  బడ్జెట్ ను  ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్. వరుసగా ఏడోసారి  పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ రికార్డ్ సృష్టించనున్నారు. 

 కేంద్ర బడ్జెట్ సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు  తెలిపారు.  జూలై 23నపార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.  కేంద్రం సిఫార్సు మేరకు   పార్లమెంట్  బడ్జెట్ సమావేశాలకు,  బడ్జెట్ కు  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు చెప్పారు.  

తాత్కాలిక బడ్జెట్

లోక్ సభ ఎన్నికలకు ముందు  ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తాత్కాలికంగా మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.   సంప్రదాయం ప్రకారం లోక్ సభ ఎన్నికలు జరిగే  ముందు మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెడ్తారు. అందులో కీలకమైన పాలసీ ప్రతిపాదనలు, ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు ఉండవు. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సాయంతో  మూడో సారి మోదీ ప్రభుత్వం ఏర్పడటంతో  నిర్మలా సీతారామన్  2024-25కు సంబంధించి  పూర్తి స్థాయి  బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు.