ఢిల్లీ: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026 ప్రసంగాన్ని 81 నిమి షాల్లోనే ముగించారు. ఆమె ఇతర ప్రసంగాలతో పోల్చితే ఇది తక్కువనే చెప్పుకోవాలి. 2020లో ఆమె ఏకంగా 2 గంటల 42 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు. భారత పార్లమెంట్ బడ్జెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రసంగం. 2025లో గంట 25 నిమిషాల పాటు ఆమె ప్రసంగించారు. అదే విధంగా 2024లో గంటా 25 నిమిషాల్లో ప్రసంగం ముగించారు. 2023లో 87 నిమిషాలు, 2022లో 92 నిమిషాల పాటు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2021లో కాగిత రహిత బడ్జెట్ ప్రవేశపె ట్టారు. అప్పుడు 1 గంటా 40 నిమిషాలు ఆమె బడ్జెట్ ప్రసంగం కొనసాగించారు.
