బుద్వేల్ భూమి హైకోర్టుకే ఇవ్వాలి.. హెచ్ఎండీఏ వేలం ఆపేస్తూ ఆదేశాలివ్వాలని పిల్

బుద్వేల్ భూమి హైకోర్టుకే ఇవ్వాలి.. హెచ్ఎండీఏ వేలం ఆపేస్తూ ఆదేశాలివ్వాలని పిల్

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌‌ మండలం బుద్వేల్‌‌ సర్వే నంబర్‌‌ 282, 299లోని 100 ఎకరాలను హైకోర్టు నిర్మా ణం కోసం ఇవ్వాలంటూ హైకోర్టులో పిల్‌‌ దాఖలైంది. హైకోర్టు బార్‌‌ అసోసియేషన్‌‌ జనరల్‌‌ సెక్రటరీ కట్టా ప్రదీప్‌‌ రెడ్డి ఈ పిల్‌‌ దాఖలు చేశారు. గతంలో చేసిన వినతులకు అనుగుణంగా 2012లో  ప్రభుత్వం హైకోర్టు నిర్మాణం కోసం ఈ భూమి ఎంపిక చేసిందన్నారు. అసోసియేషన్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కూడా ప్రభుత్వంతో భూమి విషయంలో సంప్రదింపులు జరిపారని వివరించారు. ఈ భూములను హెచ్ఎండీఏ వేలం వేయడాన్ని ఆయన సవాల్ చేశారు. సీఎస్​, హెచ్​ఎండీఏ కమిషనర్, రంగారెడ్డి కలెక్టర్​తో పాటు మరికొందరిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిల్‌‌ను చీఫ్‌‌ జస్టిస్‌‌ బెంచ్‌‌ విచారణ చేయనుంది.