
టైటిల్: బఫూన్
కాస్ట్: వైభవ్, అనఘ ఎల్. కె, అంతకుడి ఇళయరాజా, జోజు జార్జ్, డైరెక్టర్: అశోక్ వీరప్పన్
రన్ టైం: 2 గం.
ప్లాట్ ఫాం: నెట్‌ఫ్లిక్స్
లాంగ్వేజ్: తమిళం
కుమారన్(వైభవ్), ముత్తయ్య(అంతకుడి) ఇద్దరూ డ్రామా ఆర్టిస్టులు. ఊళ్లో సంపాదన లేకపోవడంతో ఇద్దరు విదేశాలకు వెళ్లిపోదామనుకుంటారు. దానికోసం కొంత డబ్బు పోగేసుకోడానికి ధనపాల్ దగ్గర లారీ డ్రైవర్లుగా చేరతారు. ధనపాల్ పెద్ద డ్రగ్ డీలర్. అది తెలియని కుమారన్, ముత్తయ్యలు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటారు. దాంతో పోలీసులకు దొరక్కుండా పారిపోతారు. అయితే ఇదంతా ఒక పొలిటికల్ గేమ్‌లో భాగమని తెలిసిన తర్వాత కుమారన్ సమస్యకు ఎదురెళ్లి దాన్ని సాల్వ్ చేయాలనుకుంటాడు. ఆ తర్వాత పొలిటీషియన్లకు, గ్యాంగ్‌స్టర్స్‌కు, కుమారన్‌కు మధ్య ఏం జరిగిందనేది మిగతా కథ.
బఫూన్ ఒక సాలిడ్ థ్రిల్లర్. కుమారన్ అనే సాధారణ వ్యక్తిని పొలిటికల్ గేమ్‌లో మిక్స్ చేసి దర్శకుడు కొత్త ప్రయోగం చేశాడు. కుమారన్‌కు, పోలీసుల మధ్య జరిగే ఛేజ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. కథలో మెయిన్ ప్లాట్‌కు తోడుగా కొన్ని సబ్ ప్లాట్స్ ఉంటాయి. వాటిద్వారా డ్రామా ఆర్టిస్టుల లైఫ్‌స్టైల్, శ్రీలంక శరణార్థుల జీవితాన్ని తెరపై చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కుమారన్ పొలిటికల్ గేమ్‌ను మార్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్. కుమారన్‌గా వైభవ్ నటన సహజంగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ సినిమాకు మరో బలం. కొన్నిచోట్ల సినిమాటిక్ లిబర్టీ ఎక్కువైనట్టు అనిపించినా క్లైమాక్స్ చూసిన తర్వాత ఓవరాల్‌గా మంచి థ్రిల్లర్ చూసిన ఫీల్ కలుగుతుంది.