
కృతీశెట్టి చేసింది ఒకే ఒక్క సినిమా. కానీ అవకాశాలు మాత్రం ‘ఉప్పెన’లా వచ్చిపడ్డాయి. ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలతో పాటు రామ్, లింగుస్వామిల సినిమాలోనూ నటిస్తోంది. మరికొన్ని ప్రాజెక్టుల విషయంలో కూడా తన పేరు వినిపిస్తోంది. అయితే తన క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిపోయిందంటే.. ఓ టీవీ సీరియల్‌కి ఆమెని బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకున్నారు. ఓ ప్రముఖ చానెల్లో రానున్న ‘ముత్యమంత ముద్దు’ సీరియల్‌ని ఆమె ప్రమోట్ చేస్తోంది. రీసెంట్‌గా ప్రోమో కూడా రిలీజయ్యింది. ఫిమేల్ లీడ్‌తో కలిసి కొన్ని సీన్స్‌లో యాక్ట్ చేసింది కృతి. వాటికి సంబంధించిన ఫొటోనే ఇది. రుణం పేరుతో దారుణాలు చేసే అత్తకి, కన్నవాళ్ల రుణం ఎప్పటికీ తీర్చుకోలేం అనుకునే కోడలికీ మధ్య జరిగే కథ ఇది. ఈ సీరియల్‌లో సీనియర్ నటి ఆమని గయ్యాళి అత్తగా కనిపించబోతోంది.