
న్యూఢిల్లీ: టీమిండియా స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా తొందర్లోనే పెండ్లి పీటలు ఎక్కనున్నట్టు సమాచారం. అతనికి మ్యారేజ్ సెట్ అయిందని తెలుస్తోంది. ఈ కారణంగానే బుమ్రా ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌కు నుంచి బ్రేక్ తీసుకున్నాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ‘త్వరలో పెండ్లి చేసుకుంటున్నట్లు బుమ్రా.. బీసీసీఐకి వెల్లడించాడు. మ్యారేజ్ ప్రిపరేషన్స్ కోసమే లీవ్ తీసుకున్నాడు’ అని బోర్డుకు చెందిన ఓ అధికారి తెలిపారు. టెస్టుల అనంతరం ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టీ20ల సిరీస్‌లో సెలెక్టర్లు బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. వన్డే సిరీస్‌లో సైతం అతను బరిలోకి దిగే చాన్స్ కనిపించడం లేదు. ఈ లాంగ్ బ్రేక్‌లో పెండ్లి తంతు పూర్తి చేసుకొని ఐపీఎల్‌తోనే స్టార్ పేసర్ తిరిగి గ్రౌండ్‌లో అడుగు పెట్టే అవకాశం ఉంది.