టీమిండియాకు షాక్..టీ20 వరల్డ్ కప్ నుంచి బుమ్రా ఔట్!

 టీమిండియాకు షాక్..టీ20 వరల్డ్ కప్ నుంచి బుమ్రా ఔట్!

టీ20 వరల్డ్ కప్కు ముందు టీమిండియా భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్కు స్టార్ పేసర్ బుమ్రా దూరమయ్యాడు. వెన్ను నొప్పి తీవ్రంగా ఉండటంతో అతను టోర్నీ నుంచి తప్పుకున్నాడు. గాయం కారణంగా ఆసియాకప్లో బుమ్రా ఆడలేదు. అయితే ఇటీవల గాయం నుంచి కోలుకున్న బుమ్రా.. ఆస్ట్రేలియా టీ20 సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. 

వెన్నులో ఫ్రాక్చర్..
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు ఎంపికైన బుమ్రా..వెన్ను నొప్పితో ఫస్ట్ టీ20ల్లో ఆడలేదు. మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో వెన్ను నొప్పి వస్తుందని ఫిజియోలకు చెప్పడంతో ఈ మ్యాచ్‌కు బుమ్రాను దూరంగా ఉంచినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. మ్యాచ్ తర్వాత బుమ్రాకు పరీక్షలు నిర్వహించగా.. అతని వెన్నులో ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అయితే ఇందుకు ఎలాంటి సర్జరీ అవసరం లేకపోయినా....4 నుంచి 6 నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దాంతోనే అతను రెండో టీ20 ఆడేందుకు గౌహతికి వెళ్లలేదు.

విండీస్, జింబాబ్వే సిరీస్లకు విశ్రాంతి..
ఈ ఏడాది జులైలో ఇంగ్లండ్తో  పర్యటన కొద్ది రోజుల పాటు బుమ్రా విశ్రాంతి తీసుకున్నాడు. ఇందులో భాగంగానే వెస్టిండీస్ తీ టీ20, వన్డే సిరీస్లలో ఆడలేదు. ఆ తర్వాత జింబాబ్వే టూర్ నుంచి కూడా తప్పుకున్నాడు. అయితే ఆసియాకప్‌ ముందు వెన్ను నొప్పి రావడంతో...మెగా టోర్నీకి బుమ్రా దూరమయ్యాడు.

ఫిట్నెస్పై సందేహాలు..
ఆసీస్‌ టూర్కు ముందు బుమ్రా, హర్షల్ పటేల్‌కు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్ట్‌లో బుమ్రా పాసైనట్లు కూడా పేర్కొన్నారు. దీంతోనే బుమ్రాను టీ20 ప్రపంచకప్‌తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్లకు ఎంపిక చేశారు. అయితే ఆసీస్‌తో ఫస్ట్ మ్యాచ్లో  బుమ్రా ఆడలేదు.  ఫిట్‌నెస్ట్ టెస్ట్ క్లియర్ చేసిన బుమ్రా.. మళ్లీ గాయపడటంతో ఎన్‌సీఏ ప్రమాణాలపై సందేహాలు కలుగుతున్నాయి. 

షమీ లేదా సిరాజ్..
ఇప్పటికే  జడేజా టీ20 వరల్డ్ కప్ కు దూరం కాగా..తాజాగా బుమ్రా  కూడా దూరమవడం భారత్ కు పెద్ద దెబ్బ. అయితే బుమ్రా దూరమవడంతో..అతని స్థానంలో మహమ్మద్ షమీ లేదా  మహమ్మద్ సిరాజ్ పేర్లను బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.