టీ20 వరల్డ్ కప్కు దూరమవడం బాధగా ఉంది

టీ20 వరల్డ్ కప్కు దూరమవడం బాధగా ఉంది

టీ20 వరల్డ్ కప్ కు దూరమవడంపై బుమ్రా భావోద్వేగానికి గురయ్యాడు.  మెగా టోర్నీలో ఆడే అవకాశం కోల్పోవడం బాధగా ఉందన్నాడు. గాయం నుంచి తాను కోలుకోవాలని ప్రతీ ఒక్కరు కోరుకున్నారని..వారందరకి ధన్యవాదాలు చెబుతున్నట్లు ట్వీట్ చేశారు. అంతేకాకుండా టీ20 వరల్డ్ కప్ కోసం ఆసీస్ వెళ్లే భారత జట్టుకు బుమ్రా శుభాకాంక్షలు తెలిపాడు. 

గాయం తగ్గడానికి చాలా సమయం..
వెన్నులో బుమ్రాకు ఫ్రాక్చర్ అయిందని..దీని కారణంగా టీ20 వరల్డ్ కప్ జట్టుకు అతను దూరమయ్యాడని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపాడు. ప్రస్తుతం బుమ్రా జాతీయ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్‌లో ఉన్నాడని చెప్పాడు. బుమ్రా గాయం తగ్గడానికి చాలా సమయం పడుతుందని..ఈ పరిస్థితుల్లో అతను ప్రపంచకప్‌లో ఆడలేడన్నాడు. మెడికల్ రిపోర్ట్స్, నిపుణుల సలహాలు, సూచనల తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించాడు. బుమ్రాకు రీప్లేస్‌‌మెంట్‌ను త్వరలో ప్రకటిస్తామని తెలిపాడు.

వెన్ను నొప్పి కారణంగా టీ20 వరల్డ్ కప్కు బుమ్రా దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. వెన్నునొప్పి కారణంగా బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని సౌతాఫ్రికా టీ20 సిరీస్ కు తప్పించింది. ఆ తర్వాత అతని పరిస్థితిని సమీక్షించిన బీసీసీఐ బృందం..టీ20 వరల్డ్ కప్ నుంచి బుమ్రాను తప్పిస్తున్నట్లు పేర్కొంది. 

వెన్నులో ఫ్రాక్చర్..
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు ఎంపికైన బుమ్రా..వెన్ను నొప్పితో ఫస్ట్ టీ20ల్లో ఆడలేదు. ఫస్ట్ టీ20 ముందు రోజు అంటే ప్రాక్టీస్ సెషన్‌లో వెన్ను నొప్పి వస్తుందని ఫిజియోలకు చెప్పడంతో ఈ మ్యాచ్‌కు బుమ్రాను దూరంగా ఉంచినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. మ్యాచ్ తర్వాత బుమ్రాకు పరీక్షలు నిర్వహించగా.. అతని వెన్నులో ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అయితే ఇందుకు ఎలాంటి సర్జరీ అవసరం లేకపోయినా....4 నుంచి 6 నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దాంతోనే అతను రెండో టీ20 ఆడేందుకు గౌహతికి వెళ్లలేదు.