భైంసా, వెలుగు: భైంసాలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గుడిలోకి ప్రవేశించిన దొంగలు స్వామి వారి గర్భగుడి తాళాలను పగులగొట్టి స్వామివారికి అలంకరించిన 3.5 కిలోల వెండి మకర తోరణం, 29 తులాల కిరీటాన్ని ఎత్తుకెళ్లారు. గర్భగుడి ముందున్న హుండీని పగులగొట్టి కానుకలను చోరీ చేశారు. ఉదయం 9గంటల ప్రాంతంలో చోరీ ఘటన బయటపడింది. ఘటనా స్థలాన్ని భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమార్, టౌన్ సీఐ గోపీనాథ్పరిశీలించారు. వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.