డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లోచోరీ..వెస్ట్​బెంగాల్లో నిందితుల అరెస్ట్​

డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లోచోరీ..వెస్ట్​బెంగాల్లో నిందితుల అరెస్ట్​

జూబ్లీహిల్స్, వెలుగు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో గురువారం చోరీ జరిగింది. నిందితులను వెస్ట్ బెంగాల్​లో​ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్​14లో భట్టి విక్రమార్కకు ఇల్లు ఉండగా, ఆయనకు ప్రజా భవన్​లో అధికారిక నివాసాన్ని కేటాయించడంతో అక్కడే ఉంటున్నారు. బంజారాహిల్స్​లోని ఇంట్లో పనివారితో పాటు వాచ్మెన్​బిహార్​కు చెందిన రోషన్ కుమార్ ఉంటున్నాడు. 

భట్టి విక్రమార్క పీఎస్​వో గా పనిచేస్తున్న భాస్కర్ శర్మ గురువారం ఉదయం సదరు వాచ్​మెన్​కు ఫోన్​ చేయగా, లిఫ్ట్​చేయలేదు. వేరే పనివారికి ఫోన్​ చేయగా, ఇంట్లోని బెడ్​రూమ్ తలుపుతోపాటు బీరువా కూడా బ్రేక్​చేసి ఉందని చెప్పారు. దీంతో ఇంట్లోని రూ. 80 వేల నగదు, వెండి ఆభరణాలు పోయాయని బంజారాహిల్స్​పోలీసులకు భాస్కర్ శర్మ ఫిర్యాదు చేశారు. 

దర్యాప్తు చేపట్టిన పోలీసులు..ఖరగ్పూర్ రైల్వేస్టేషన్​లో మండల్ కుమార్, అతడితో సంబంధమున్న ఉదయ్ కుమార్ ఠాకూర్​ను అక్కడి రైల్వే పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు గ్రాముల బంగారం, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.