అప్పు తిరిగి ఇవ్వట్లేదనే కోపంతో .. 80 లక్షల కారుని తగలబెట్టిండు

 అప్పు తిరిగి ఇవ్వట్లేదనే కోపంతో .. 80 లక్షల కారుని తగలబెట్టిండు

తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వట్లేదనే కోపంతో రూ.  80 లక్షల స్పోర్ట్స్ కారుని తగలబెట్టాడో ప్రబుద్ధడు. పహాడీషరీఫ్ పిఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నార్సింగి ప్రాంతానికి చెందిన నీరజ్ అనే వ్యాపారి 2009 మోడల్ కి చెందిన డిఎల్09 సివి 3636 నెంబర్ తో ఉన్న స్పోర్ట్స్ కారును సెకండ్ హ్యాండ్ లో కొన్నాడు. ప్రస్తుతం ఆ కొత్త కారు సుమారు రూ.4 కోట్ల విలువ ఉంటుంది. కారుపై ఉన్న సోకు తీరగానే కొంతకాలం తర్వాత అమ్మేశాడు. 

నీరజ్ తమకు డబ్బులు ఇవ్వాలంటూ కారు కొన్న వ్యక్తిని కొందరు వ్యక్తులు బెదిరించారు. నీరజ్ ని పిలిపిస్తామని చెప్పినా వినకుండా వెంట వచ్చిన వారు బాటిల్ లో తెచ్చుకున్న పెట్రోల్ ను  కారుపై పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు.  ఫైర్ ​ఇంజన్​ ఘటనా స్థలికి చేరుకునే లోపే కారు పూర్తిగా దగ్ధమయ్యింది. అమన్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.