రియోడిజనిరో: బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఇసుక లోడ్‌తో వస్తున్న ట్రక్కు, బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది స్పాట్ లోనే చనిపోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం11.30 గంటలకు రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలోని నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇసుక లోడ్ తో వస్తున్న ట్రక్కు, బస్సు ఒకదానికొకటి వేగంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. అయితే, ఈ ప్రమాదంలో ఇసుక లోడ్‌తో వస్తున్న ట్రక్కులోని కొంతభాగం బస్సు క్యాబిన్ లోకి చొచ్చుకెళ్లిందని పేర్కొన్నారు. ట్రక్కులోని ఇసుక మొత్తం ప్రయాణికులపై పడిపోవడంతో11 మంది స్పాట్ లోనే మృతి చెందారని వెల్లడించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు.
