బస్సు బ్రేకులు ఫెయిల్.. సింగిల్ హ్యాండ్తో 45 మందిని కాపాడిండు

బస్సు బ్రేకులు ఫెయిల్..  సింగిల్ హ్యాండ్తో  45 మందిని కాపాడిండు

హైదరాబాద్లో ప్రయాణిస్తున్న ఓ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో  డ్రైవర్ చాకచక్యంతో దాదాపు  45 ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.  కోఠి నుంచి పటాన్‌చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు కేబీఆర్‌ పార్కు వద్ద బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయి. అయితే కంగారు పడకుండా బస్సు డ్రైవర్ చాలా  చాకచక్యంగా వ్యవహరించాడు.  

వెంటనే  బస్సును  సింగిల్ హ్యాండ్ తో పార్కు వైపు ఉన్న ఫుట్‌పాత్‌పై నిలిపాడు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పిల్చుకున్నారు.  ఆ సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా డ్రైవర్ వెంకటేష్ గౌడ్ తెలిపాడు. తమ ప్రాణాలను కాపాడినందుకు డ్రైవర్ వెంకటేష్ కు  ప్రయాణికులు థాంక్స్ చెప్పారు.  ఈ ఘటనతో కేబీఆర్ పార్కు రోడ్డుపై స్వల్ప ట్రాఫిక్ ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.