లక్నో: యూపీ వారియర్జ్ కెప్టెన్‌గా ఆసీస్ దిగ్గజ ప్లేయర్ మెగ్ లానింగ్ ఎంపికైంది. ఇండియన్ ఆల్ రౌండర్ దీప్తి శర్మపై వేటు వేసి ఆమె స్థానంలో మెక్ లానింగ్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది యూపీ యాజమాన్యం. ఈ మేరకు యూపీ వారియర్జ్ ఆదివారం (జనవరి 4) సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేసింది. ‘‘ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు ముందు ఆస్ట్రేలియన్ గ్రేట్ ప్లేయర్ మెగ్ లానింగ్‌ను తమ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా నియమిస్తున్నాం’’ అని ప్రకటనలో పేర్కొంది.
డబ్ల్యూపీఎల్‌లో గత మూడు సీజన్లు మెగ్ లానింగ్ ఢిల్లీ తరుఫున ఆడింది. ఆమె నేతృత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడు సీజన్లు ఫైనల్‌కు చేరుకుంది. కానీ మూడుసార్లు ఢిల్లీకి నిరాశే ఎదురైంది. సీజన్ మొత్తం అద్భుతంగా రాణించిన డీసీ టైటిల్ ఫైట్‌లో చిత్తయింది. ఈ నేపథ్యంలో 2026 సీజన్ కోసం మెగ్ లానింగ్‌ను డీసీ రిటైన్ చేసుకోలేదు. దీంతో వేలంలో లానింగ్‌ను యూపీ వారియర్స్ రూ.1.9 కోట్లకు దక్కించుకుంది.
►ALSO READ | IND vs NZ: రెస్ట్ కాదు.. వేటు కాదు: టీమిండియా రెగ్యులర్ ఆల్ రౌండర్‌ను పక్కన పెట్టిన సెలక్టర్లు
ఆసీస్ తరుఫున కెప్టెన్‌గా ఘనమైన చరిత్ర ఉన్న మెక్ లానింగ్‌కు యూపీ జట్టు పగ్గాలు అప్పగించింది. కాగా, యూపీ కెప్టెన్‌గా తన నియామకంపై లానింగ్ స్పందిస్తూ.. యూపీ వారియర్జ్‌కు నాయకత్వం వహించడం చాలా గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. డబ్ల్యూపీఎల్ నాలుగవ సీజన్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. డబ్ల్యూపీఎల్ 2026 జనవరి 9 నుంచి ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఆర్సీబీ తొలి మ్యాచులో తలపడనున్నాయి.
WPL 2026 అన్ని జట్ల కెప్టెన్లు:
- RCB - స్మృతి మంధాన.
- MI - హర్మన్‌ప్రీత్ కౌర్.
- UPW - మెగ్ లానింగ్.
- GG - ఆష్లీ గార్డనర్.
- DC - జెమిమా రోడ్రిగ్స్.
