బుద్ధుడి బోధనలు చాలా గొప్పవి: మంత్రి వివేక్ వెంకటస్వామి

బుద్ధుడి బోధనలు చాలా గొప్పవి: మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్  హుస్సేన్ సాగర్ లోని బుద్ధుని విగ్రహం దగ్గర బుద్దిస్టుల క్యాలెండరును ఆవిష్కరించారు  మంత్రి వివేక్ వెంకటస్వామి . బహుజన్ సమ్యక్ సంఘటన్ ప్రెసిడెంట్ ప్రీతా హరిత్ తో కలిసి క్యాలెండర్ ఆవిష్కరించారు.ఈ  సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామి... హైదరాబాద్ లో ఉన్న బుద్దిస్టులందరు  బుద్దిస్ట్  కార్యక్రమాలను ప్రోత్సహించాలన్నారు.  బుద్ధుడి భోదనలు చాలా గొప్పవన్నారు. ప్రతి ఒక్కరు బుద్ధిడి మార్గంలో నడవాలని సూచించారు. ఇతరులకు మేలు చేయాలనీ అంబేద్కర్ సూచించారని.. అంబేద్కర్ దేశానికి దారి చూపినట్లు మనం  ఎదగాలన్నారు.  విద్యా రంగం కానీ ఆర్థిక రంగంలో కానీ ముందుకు వెళ్ళడానికి అంబేద్కర్ కారణమని చెప్పారు.  

దేశం మొత్తం బుద్దమయం కావలసిన అవసరం ఉందన్నారు బహుజన్ సమ్యక్ సంఘటన్ ప్రెసిడెంట్ ప్రీతా హరిత్.  దేశంలో అహింస, శాంతి, కావాలి ప్రేమ.. కానీ చాలా మంది ధర్మం, జాతి, పెద్ద చిన్న, ఎక్కువ తక్కువ పేరుతో విభేదాలు సృష్టిస్తున్నారు... అవన్నీ సమాజంలో తొలగించాల్సిన అవసరం ఉంది. సమాజంలో శాంతి, ప్రేమ, అహింసను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. 

►ALSO READ | త్వరలోనే కృష్ణా జలాలపై మాట్లాడుతా.. అన్నీ విషయాలు చెప్తా: ఏపీ సీఎం చంద్రబాబు