ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 14 మందికి తీవ్ర గాయాలు

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 14 మందికి తీవ్ర గాయాలు

హైదరాబాద్: ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం (జనవరి 4) రాత్రి వాజేడు మండలం మండపాక దగ్గర ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి టాటా మ్యాజిక్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా.. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. 

గాయపడ్డవారిని చికిత్స కోసం ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గురైన వారిని కమలాపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వెంకటాపురం మండలంలో పనికి వెళ్లి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.