70 మీటర్ల లోయలో బస్సు బోల్తా.. ఐదుగురు ప్రయాణికులు మృతి

70 మీటర్ల లోయలో బస్సు బోల్తా.. ఐదుగురు ప్రయాణికులు మృతి

తెంకాశీ: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం తెంకాశీ జిల్లాలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొని ఆరుగురు చనిపోయారు. మరో 56 మంది గాయపడ్డారు. ఒక బస్సు మదురై నుంచి శెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోట్టై వెళ్తుండగా, మరొకటి తెంకాశీ నుంచి కోవిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పట్టి వెళ్తున్నది. ఈ క్రమంలో రెండు బస్సులు తెంకాశీ జిల్లాలోని కడయనల్లూరు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద ధాటికి రెండు బస్సులు ముందు భాగంలో నుజ్జునుజ్జు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు చనిపోయారని పోలీసులు తెలిపారు. మరో 56 మంది ప్యాసింజర్లు గాయపడ్డారని, బాధితులందరూ ఆస్పత్రుల్లో ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పొందుతున్నారని చెప్పారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘‘ప్రాథమిక ఆధారాలను బట్టి మదురై నుంచి వస్తున్న బస్సు డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది తప్పు అని తెలుస్తున్నది. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం కారణంగానే ప్రమాదం జరిగింది. దీనిపై విచారణ జరుగుతున్నది. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం” అని వెల్లడించారు.  

ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లోయలో పడ్డ బస్సు... 

ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడి ఐదుగురు ప్రయాణికులు మరణించారు. మరికొంత మంది గాయపడ్డారు. 28 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు.. తెహ్రీ జిల్లాలోని నరేంద్రనగర్ వద్ద అదుపుతప్పి 70 మీటర్ల లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) సిబ్బంది స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.