V6 News

భయంకర ప్రమాదం.. కారును ఢీకొట్టి పల్టీలు కొట్టిన ఆర్టీసీ బస్సు

భయంకర ప్రమాదం.. కారును ఢీకొట్టి పల్టీలు కొట్టిన ఆర్టీసీ బస్సు

కోల్ కతాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాల్ట్ లేక్ ప్రాంతంలో అక్టోబర్  2వ తేదీ సోమవారం ఉదయం  అతివేగంతో వచ్చిన బస్సు.. కారును ఢీకొట్టి బస్సు బోల్తా పడింది. ఈ  ప్రమాదంలోపది మంది గాయపడ్డారు. అయితే కారును బస్సు ఢీకొట్టిన విజువల్స్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. స్థానికంగా ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. 

అక్టోబరు 2వ తేదీ ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ బస్సు అతివేగంగా వస్తోంది. ఈ సమయంలో మరో రోడ్డు నుంచి కారు వెళ్తుండగా...ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 30 మంది ఉన్నారు. అయితే  రెండు బస్సులు ఒకదానికొకటి ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఓ బస్సు కారును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.