తిరుపతి జిల్లా భాకరాపేట ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా.. 40 మందికి తప్పిన పెను ప్రమాదం

తిరుపతి జిల్లా భాకరాపేట ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా.. 40 మందికి తప్పిన పెను ప్రమాదం

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. మంగళవారం (జూన్  9)​కలకడ నుంచి తిరుపతి వస్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి ఘాట్ రోడ్డు పక్కన పిట్టగోడను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. 

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటన స్థలానికి పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

►ALSO READ | వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలకు మంత్రులు పవన్ కల్యాణ్, లోకేష్ పరామర్శ