ప్రయాణీకుడికి గుండెపోటు .. సీపీఆర్ చేసి కాపాడిన ఆర్టీసీ సిబ్బంది

ప్రయాణీకుడికి గుండెపోటు .. సీపీఆర్ చేసి కాపాడిన ఆర్టీసీ సిబ్బంది

హైదరాబాద్, వెలుగు: రన్నింగ్​ఆర్టీసీ బస్సులో గుండెపోటుకు గురైన ప్రయాణికుడికి డ్రైవర్, కండెక్టర్​సీపీఆర్​చేసి కాపాడారు. జీడిమెట్ల డిపోకు చెందిన 192/1 నంబర్​బస్సు శుక్రవారం బాలాన‌గ‌ర్ నుంచి బ‌హ‌దూర్‌ప‌ల్లి బయలుదేరింది. చింత‌ల్ ఐడీపీల్ బ‌స్ స్టాప్ ముర‌ళీకృష్ణ అనే ప్రయాణికుడికి గుండెపోటు గురయ్యాడు. కండక్టర్​అంజ‌లి గుర్తించి డ్రైవ‌ర్ సైదులును అప్రమత్తం చేసింది. 108 కాల్ చేయడంతోపాటు బస్సును పక్కకు ఆపి ముర‌ళీకృష్ణకు సీపీఆర్ చేశారు. తర్వాత అంబులెన్స్‌లో ఆసుపత్రికి త‌ర‌లించారు. సమయ స్ఫూర్తితో వ్యవహరించి ప్రయాణికుడిని కాపాడిన కండెక్టర్, డ్రైవ‌ర్​ను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అభినందించారు.