తెలంగాణలో రేపటి నుంచి బస్సు సర్వీసులు!

తెలంగాణలో రేపటి నుంచి బస్సు సర్వీసులు!

లాక్డౌన్ వల్ల ఇన్నాళ్లూ బందున్న ఆర్టీసీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కే అవకాశముంది. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినేట్ భేటీలో ఆర్టీసీ రవాణాపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త సడలింపుల ప్రకారం..  బస్సులు నడిపే విషయంపై నిర్ణయాన్నికేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. లాక్డౌన్ వల్ల బస్సులు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే నేటి భేటీలో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడపాలా? వద్దా? అనే విషయంపై చర్చించనున్నారు. ఈ భేటీలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆర్టీసీ సేవలకు సంబంధించి ఒక నివేదికను కూడా సమర్పించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు నడిపేందుకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కరోనావైరస్ వల్ల దేశవ్యాప్తంగా దాదాపు రెండు నెలల నుంచి లాక్డౌన్ అమలులో ఉంది. దాంతో రవాణా సౌకర్యం పూర్తిగా నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఇచ్చిన కొన్ని సడలింపుల ద్వారా తెలంగాణలో కూడా బస్సులు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఒకవేళ నేటి భేటీలో బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంటే.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో రేపటి నుంచే బస్సు సర్వీసులు ప్రారంభించనున్నట్లు సమాచారం. రెడ్ జోన్లో మాత్రం ఇప్పట్లో బస్సులు నడిచే పరిస్థితి కనిపించడంలేదు. అయితే బస్సుల్లో కేవలం 50 శాతం సీట్లలోనే ప్రయాణికులను ఎక్కించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాల నుంచి వచ్చే బస్సులను జేబీఎస్ వరకే నడపాలనే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం.

బస్సులకు శానిటైజ్.. ప్రయాణికులకు థర్మల్‌‌‌‌ స్క్రీనింగ్

ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో బస్సులు నడపాలని ప్రభుత్వం చూస్తోంది. అయితే ప్రయాణికుల వల్ల కరోనా వ్యాపించకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బస్సులను ఇప్పటికే పూర్తిగా శానిటైజ్‌‌‌‌ చేశారు. బస్సు ఎక్కే ప్రతి ప్యాసింజర్‌‌‌‌కు థర్మల్‌‌‌‌ స్క్రీనింగ్‌‌‌‌ చేయనున్నారు. మాస్క్‌‌‌‌ కట్టుకుంటేనే బస్సులోకి అనుమతిస్తారు. బస్సు ఎక్కకముందే కండక్టర్‌‌‌‌ వద్ద టికెట్లు తీసుకోవాలి. ప్రధాన బస్టాప్‌‌‌‌లలో టికెట్‌‌‌‌ కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. స్టాప్‌‌‌‌ల వద్ద జనం గుమిగూడకుండా చూసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తారు. ఫిజికల్‌‌‌‌ డిస్టెన్స్‌‌‌‌ ఉండేలా బస్సుల్లో సీట్లకు నంబర్స్‌‌‌‌ వేస్తున్నారు. ఆయా నంబర్స్‌‌‌‌ ఉన్న చోటే ప్యాసింజర్‌‌‌‌ కూర్చోవాల్సి ఉంటుంది. సీట్లలో క్రాస్‌‌‌‌ మార్క్‌‌‌‌ కూడా వేస్తున్నారు. అంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూర్చోవద్దని అర్థం.

ఏ బస్సులో ఎంతమందిని ఎక్కనిస్తారంటే..

బస్సులను 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడపాలనే నిబంధన ఉండటంతో దానికి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పల్లె వెలుగు బస్సులో 56 సీట్లు ఉండగా 25 నుంచి 30 మందిని, ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌లో 49 సీట్లుండగా 25 మంది వరకు, సూపర్‌‌‌‌ లగ్జరీలో 39 సీట్లుండగా 17 మందిని మాత్రమే ఎక్కించుకోనున్నారు. రెండు సీట్లుంటే ఒకరు, మూడు సీట్లుంటే ఇద్దరు చొప్పున కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో సంస్థకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చార్జీలు పెంచాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. కరోనా అదుపులోకి వచ్చేంతవరకు 50 శాతం బస్సులనే నడపాలని ఆర్టీసీ యోచిస్తోంది.

For More News..

స్టాక్ మార్కెట్ నష్టాలతో గవర్నమెంట్ టీచర్ సూసైడ్

కరోనా కోసం ఆయుష్ టాస్క్‌ఫోర్స్