సికింద్రాబాద్ రైల్ భవన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదంలో బస్సు అద్దం ధ్వంసం అయ్యింది. ట్రాక్టర్ రాంగ్ రూట్ లో రావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంతో రైలు భవన్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తీసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

