Real Estate: ముంబై రియల్టీలో రికార్డ్.. రూ.400 కోట్లతో ప్రాపర్టీ కొన్న ఉదయ్ కోటక్..

Real Estate: ముంబై రియల్టీలో రికార్డ్.. రూ.400 కోట్లతో ప్రాపర్టీ కొన్న ఉదయ్ కోటక్..

Uday Kotak: దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఆయన ముంబైలో కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ రికార్డు ధర దీనికి కారణం.

బిలియనీర్ ఉదయ్ కోటక్ ముంబై వర్లీలో బీచ్ వ్యూ కలిగిన రెసిడెన్సియల్ ప్రాపర్టీని ఏకంగా రూ.400 కోట్లకు కొనుగోలు చేస్తున్నారు. నగరంలోని రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ధరలకు ఇదొక బెంచ్‌మార్క్‌గా మారింది. 

ముంబై వర్లీ సీ ఫేసింగ్ ప్రాపర్టీ షాంపైన్ హౌస్ పక్కనే ఉంది. కోటక్ కుటుంబం దీనిని వైన్ కంపెనీ ఇండేజ్ వింట్నర్స్ మేనేజింగ్ డైరెక్టర్ రంజిత్ చౌగులే నుంచి రూ.385 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ప్రాంతంలో 1396 చదరపు అడుగులు ఉన్న పెద్ద అపార్ట్మెంట్ అత్యధికంగా రూ.38 కోట్ల 24 లక్షలకు అమ్ముడుపోగా.. 173 చదరపు అడుగుల ప్రాపర్టీ అత్యల్పంగా రూ.4కోట్ల 70 లక్షలు పలికింది. ప్రస్తుతం కోటక్ కుటుంబం మెుత్తం ప్లాట్లను ఒకటిగా చేసి రీడెవల్పెమెంట్ చేస్తుందా లేక విడివిడిగా ఉంచుతుందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి డీల్ విషయం గురించి ఉదయ్ కోటక్ లేదా ఆయన కుటుంబం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

►ALSO READ | Loan News: జాయింట్ లోన్ తీసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోతుందా..?