
రెండుసార్లు నీట్ పరీక్ష రాశాడు. మొదటి అటెంప్ట్ లోనే MBBS సీటు సాధించాడు. కానీ సంతృప్తి చెందలేదు.. టాప్ కాలేజీలో సీటు కోసం మరోసారి ఎగ్జామ్ రాశాడు.. ఈసారి అనుకున్నది సాధించాడు.. అనుకున్నట్లుగానే టాప్ మెడికల్ కాలేజీ గోరఖ్ పూర్లోని AIIMS లో అడ్మిషన్ పొందాడు.. ఇక క్లాసులకు అటెండ్ కావడమే మిగిలింది..ఇంతలోనే విషాదం..సూసైడ్..తాను చనిపోవడానికి చెబుతూ రాసిన లెటర్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మహారాష్ట్రకు చెందిన 20 ఏళ్ల అనురాగ్ అనిల్ బోర్కర్..NEET లో 147 ర్యాంకు సాధించాడు. ఓబీసీ కోటాలో గోరఖ్ పూర్ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో సీటు పొందాడు. ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం యూపీలోని గోరఖ్ పూర్ కు వెళ్లడానికి కొన్ని గంటల ముందు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. మరికొద్ది గంటల్లో కాలేజీలో చేరనుండగా.. అనురాగ్ ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అనురాగ్ గదిలో పోలీసులకు ఓ సూసైడ్ నోట్ దొరికింది. అందులో సంచలన విషయాలు బయటపడ్డాయి. అనురాగ్ ఒత్తిడి, తాను చదవబోయే ఐదేళ్ల ఎంబీబీఎస్ కోర్సు ట్రైనింగ్ ఓ కారణం అయి ఉండొచ్చని ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు చెబుతున్నాయి.
►ALSO READ | రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్...78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్రం
సూసైడ్ నోట్ అనురాగ్ సంచలన విషయాలు రాశాడు. తనకు ఎంబీబీఎస్ చదవడం ఇష్టం లేదని.. డాక్టర్ కంటే ఓ బిజినెస్ మ్యాన్ అధికంగా సంపాదిస్తున్నారు. ఐదేళ్లు చదువుకుని.. ఆ తర్వాత ఎండీ చేయాలి.. ఇవన్నీ నేను చేయాలనుకోవడం లేదు అని రాయడం చూస్తుంటే..అతను సాధించిన విజయాలు ఉన్నప్పటికీ వైద్య వృత్తిని కొనసాగించడంలో ఆసక్తి లేకపోవడాన్ని ఆ నోట్ ద్వారా తెలుస్తోంది.
అనురాగ్ లాంటి టాలెంట్ ఉన్న వాళ్లు కూడా ఒత్తిడి, అనాసక్తితో చనిపోవడం పట్ల, వైద్య విద్య కోర్సు విధానం పట్ల సర్వత్రా ఆసక్తికర చర్చ దారితీసింది.