ధాన్యం కుప్పల వద్ద రైతుల గుండెలు ఆగిపోయినా.. మీ గుండెలు కరగడం లేదు

ధాన్యం కుప్పల వద్ద రైతుల గుండెలు ఆగిపోయినా.. మీ గుండెలు కరగడం లేదు
  • వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై డ్రామాలు ఢిల్లీకి చేరాయి కానీ.. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు నడిచేది లేదు.. కొనేది లేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు పండిన పంట తడిసిపోయి మొలకలొస్తుంటే.. కష్ట పడి పండించిన పంట కండ్ల ముందు కొట్టుకుపోతుంటే.. మొలకలొచ్చిన నారు వేసుకోవాలో.. పారబోసుకోవాలో.. కొంటారో కొనరో తెలియక ధాన్యం కుప్పల పైనే రైతుల గుండెలు ఆగిపోయాయి కానీ మీ గుండెలు కరుగటం లేదంటూ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన షర్మిల ఉత్తరాదిలో చనిపోయిన రైతులకు లక్షల సాయం చేస్తున్న మీకు తెలంగాణ రైతుకష్టాలు కానొస్తలేవని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతు కన్నీళ్లు ఆవిరికాకముందే.. మన రైతుల ప్రాణాలు పోకముందే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.