జనవరిలో 3 టోర్నీలు ఆడనున్న స్టార్స్
8 మందితో ఇండియా టీమ్ ఎంపికఎన
2021 ఫస్టాఫ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన బీడబ్ల్యూఎఫ్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో లాంగ్ బ్రేక్ తీసుకున్న ఇండియా స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు.. మళ్లీ రాకెట్లు పట్టేందుకు సిద్ధమవుతున్నారు. జనవరిలో బ్యాంకాక్‌లో జరిగే మూడు కీలక టోర్నీల్లో వీళ్లు బరిలోకి దిగనున్నారు. ఇందులో వరల్డ్ టూర్ ఫైనల్స్ కూడా ఉంది. టోక్యో ఒలింపిక్ క్వాలిఫికేషన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ టోర్నీల కోసం ఎనిమిది మందితో కూడిన స్ట్రాంగ్ టీమ్‌ను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) సోమవారం ప్రకటించింది. సింధు, సైనా, సాయి ప్రణీత్, శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి, అశ్విని పొనప్ప, సిక్కి రెడ్డీ ఇందులో ఉన్నారు. జనవరి 12 నుంచి 17 వరకు యోనెక్స్ థాయ్‌లాండ్ ఓపెన్, 19 నుంచి 24 వరకు టయోటా థాయ్‌లాండ్ ఓపెన్, 27 నుంచి 31 వరకు వరల్డ్ టూర్ ఫైనల్స్ జరగనున్నాయి. మార్చిలో కరోనా వైరస్ ఔట్ బ్రేక్ కావడంతో.. స్పోర్టింగ్ వరల్డ్ మొత్తం ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో పెద్ద టోర్నీలన్నీ పోస్ట్‌పోన్ కావడంతో టాప్ ప్లేయర్లందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే మళ్లీ ఇప్పుడిప్పుడే టోర్నీలు ప్రారంభం అవుతుండటంతో ప్లేయర్లు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీకాంత్ ఒక్కడే అక్టోబర్‌లో ఇంటర్నేషనల్ టోర్నీతో ఆట మొదలుపెట్టాడు. మరోవైపు కరోనా కారణంగా పోస్ట్‌పోన్ అయిన టోర్నీలను రీషెడ్యూల్ చేస్తూ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 2021 ఫస్టాఫ్ వరకు కొత్త క్యాలెండర్ రిలీజ్ చేసింది. టోక్యో ఒలింపిక్స్ వరకూ 17 టోర్నీలను షెడ్యూల్ చేసింది.
బీడబ్ల్యూఎఫ్ షెడ్యూల్
జనవరి 12–17 యోనెక్స్ థాయ్‌లాండ్ ఓపెన్
జనవరి 19–24 టయోటా థాయ్‌లాండ్ ఓపెన్
జనవరి 27–31 వరల్డ్ టూర్ ఫైనల్స్
మార్చి 31–
ఏప్రిల్ 4 మలేసియన్ ఓపెన్
ఏప్రిల్ 13–18 సింగపూర్ ఓపెన్
మే 11–16 ఇండియా ఓపెన్
జూన్ 1–6 ఇండోనేసియా మాస్టర్స్
జూన్ 8–13 ఇండోనేసియా ఓపెన్

