బీడబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌..‌‌‌‌‌‌‌ క్వార్టర్ ఫైనల్లో ఇండియా

బీడబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌..‌‌‌‌‌‌‌ క్వార్టర్ ఫైనల్లో ఇండియా

గువాహతి: బీడబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ జూనియర్ మిక్స్‌‌‌‌‌‌‌‌డ్ టీమ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఆతిథ్య ఇండియా వరుసగా మూడు విజయాలతో  క్వార్టర్ -ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరుకుంది. బుధవారం (అక్టోబర్ 09)  జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 2–0 (45–-37, 45–-34)తో వరుస సెట్లలో యూఏఈని చిత్తుగా ఓడించింది. ఫలితంగా గ్రూప్–హెచ్‌‌‌‌‌‌‌‌ టాపర్‌‌‌‌‌‌‌‌గా నాకౌట్‌‌‌‌‌‌‌‌కు రెడీ అయింది. 

రెండో సీడ్‌‌‌‌‌‌‌‌గా బరిలో నిలిచిన ఇండియాకు గ్రూప్ చివరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో తన్వి శర్మ 9--–5 తేడాతో ప్రకృతి భరత్‌‌‌‌‌‌‌‌పై గెలిచచి మంచి ఆరంభం అందించింది.   మిక్స్‌‌‌‌‌‌‌‌డ్ డబుల్స్ జోడీ  లాల్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌సంగా–విశాఖ తోప్పో.. ఆదిత్య కిరణ్–సాక్షిని ఓడించి స్కోరును 18-–10కు పెంచింది. బాయ్స్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌, డబుల్స్‌‌‌‌‌‌‌‌లో యూఏఈ ప్లేయర్లు సత్తా చాటి ఆ జట్టును రేసులోకి తెచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఇక,  రెండో సెట్‌‌‌‌‌‌‌‌లో తన్వి స్థానంలో బరిలోకి దిగిన ఉన్నతి హుడా 9-–6 తో ప్రకృతిపై గెలవడంతో ఇండియా విజయం ఖాయమైంది.