టైటిల్‌‌ నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలోకి సింధు

టైటిల్‌‌ నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలోకి సింధు
  • గోల్డెన్‌‌‌‌ ఫినిషింగ్‌‌పై సింధు గురి
  • నేటి నుంచి వరల్డ్​ చాంపియన్​షిప్స్​
  • టైటిల్​ నిలబెట్టుకోవడమే టార్గెట్​గా బరిలోకి
  • పోటీలో శ్రీకాంత్‌‌, ప్రణీత్‌‌

రెండు బ్రాంజ్‌‌, రెండు సిల్వర్‌‌, ఒక గోల్డ్‌‌. మొత్తం ఐదు మెడల్స్‌‌.  బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌లో ఇండియా స్టార్‌‌ షట్లర్‌‌ పీవీ సింధు పెర్ఫామెన్స్‌‌ ఇది. విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో ఐదు మెడల్స్‌‌ గెలిచిన సెకండ్‌‌ ప్లేయర్‌‌ తను. ఇప్పటిదాకా ఈ టోర్నీలో ఇండియాకు పది పతకాలు వస్తే  అందులో సగం సింధునే తెచ్చింది. 2015 తప్పితే వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌లో పోటీ పడ్డ ప్రతీసారి మెడల్‌‌తో తిరిగొచ్చిందామె. లాస్ట్ ఎడిషన్‌‌ (2019)లో గోల్డ్ కొట్టి తన కల నెరవేర్చుకుంది..! ఇప్పుడు డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ హోదాలో మరో గోల్డ్​పై కన్నేసిందామె..! మూడు సార్లుచాంపియన్‌‌ కరోలినా మారిన్‌‌, 2017 విన్నర్‌‌ ఒకుహరా లేకపోవడం ఆమెకు ప్లస్‌‌ పాయింట్‌‌..!  ఏ పతకం తెచ్చినా విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో ఆరు మెడల్స్‌‌ నెగ్గిన ఫస్ట్‌‌ ప్లేయర్‌‌గా సింధు హిస్టరీ క్రియేట్‌‌ చేస్తుంది..! కానీ, ఆమె టార్గెట్‌‌ మాత్రం మరోసారి వరల్డ్‌‌ చాంపియన్‌‌గా నిలవడమే..! మరి,  నేటి నుంచి జరిగే మెగా టోర్నీలో గెలిచి ఈ ఇయర్​కు సింధు గోల్డెన్‌‌ ఫినిషింగ్‌‌ ఇస్తుందా..? 


హుయెల్వా (స్పెయిన్‌‌): అప్పటిదాకా ఎలా ఆడినా పెద్ద ఈవెంట్‌‌లోకి రాగానే అదరగొట్టడం హైదరాబాదీ పీవీ సింధు స్టయిల్‌‌. ఇప్పుడు తనకు అచ్చొచ్చిన మెగా టోర్నమెంట్‌‌లో సత్తా చాటేందుకు రెడీ అయింది. ఆదివారం మొదలయ్యే వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో   టైటిల్‌‌ నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సింధు బరిలోకి దిగుతోంది. టోక్యో ఒలింపిక్స్‌‌లో బ్రాంజ్‌‌ నెగ్గిన  తర్వాత వరుసగా  ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌, ఇండోనేసియా మాస్టర్స్‌‌, ఇండోనేసియా ఓపెన్‌‌ టోర్నీల్లో సెమీఫైనల్‌‌ వరకూ వచ్చిన ఆమె గతవారం బీడబ్ల్యూఎఫ్​ వరల్డ్‌‌ టూర్‌‌ ఫైనల్స్‌‌ టోర్నీలో సిల్వర్‌‌తో మెప్పించింది. టైటిల్‌‌ ఫైట్‌‌కు వచ్చే క్రమంలో  సెకండ్‌‌  సీడ్‌‌ అకానె యమగూచిని ఓడించి ఫామ్‌‌లోకి వచ్చింది. ఇప్పుడు వరల్డ్​ చాంపియన్​షిప్​లో ఆరో సీడ్‌‌గా బరిలోకి దిగుతున్న 26 ఏళ్ల సింధుపై భారీ అంచనాలున్నాయి. మరోవైపు పలువురు స్టార్‌‌ ప్లేయర్లు లేకపోవడంతో ఈ సారి టోర్నీ కాస్త కళ తప్పింది. ఇండోనేసియా టీమ్‌‌ మొత్తం విత్‌‌డ్రా అయింది. మెన్స్‌‌లో రెండు సార్లు విన్నర్‌‌ కెంటో మొమోటా, విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో మూడు సార్లు విజేత కరోలినా మారిన్‌‌, 2017 చాంప్‌‌ నజోమి ఒకుహరా కూడా దూరంగా ఉన్నారు. ఇండియా స్టార్‌‌, 2015 ఎడిషన్‌‌ సిల్వర్‌‌ మెడలిస్ట్‌‌ సైనా నెహ్వాల్‌‌ గాయాల కారణంగా  కెరీర్‌‌లో ఫస్ట్‌‌ టైమ్‌‌ ఈ టోర్నీలో ఆడటం లేదు.  దాంతో, ఇండియా నుంచి సింధుపైనే  అందరి ఫోకస్‌‌ ఉంది. అయితే, తను టైటిల్‌‌ నిలబెట్టుకోవడం అంత ఈజీ కాకపోవచ్చు. టాప్‌‌ సీడ్‌‌ తై జుయింగ్‌‌ (చైనీస్‌‌ తైపీ), తొమ్మిదో సీడ్‌‌ చొచువాంగ్‌‌ (తైపీ)తో పాటు  వరల్డ్‌‌ టూర్‌‌ ఫైనల్స్‌‌ టైటిల్​ ఫైట్​లో తనను ఓడించిన  కొరియా టీనేజ్‌‌ సెన్సేషన్‌‌ అన్‌‌ సియంగ్‌‌తో సవాల్‌‌ ఎదురవనుంది.   ఫస్ట్‌‌ రౌండ్‌‌లో  సింధుకు బై లభించింది. సెకండ్‌‌ రౌండ్‌‌లో మార్టినా రెపిస్కాతో ఇండియా స్టార్‌‌ తన టైటిల్‌‌ డిఫెన్స్‌‌ వేటను స్టార్ట్‌‌ చేయనుంది. ఇందులో గెలిస్తే..ప్రిక్వార్టర్స్‌‌లో చొచువాంగ్‌‌తో పోటీ పడాల్సి ఉంటుంది. అయితే, ఆమెతో ఆడిన చివరి రెండు మ్యాచ్‌‌ల్లో సింధు ఓడిపోవడం గమనార్హం.   చొచువాంగ్‌‌ను దాటితే క్వార్టర్స్‌‌లో టాప్‌‌ సీడ్‌‌ తై జుయింగ్‌‌తో సింధుకు అసలైన సవాల్‌‌ ఎదురవనుంది. చివరి నాలుగు మ్యాచ్‌‌లతో పాటు తైజుతో  హెడ్‌‌ టు హెడ్‌‌ ఆడిన 19 మ్యాచ్‌‌ల్లో  తెలుగమ్మాయి 14 సార్లు ఓడిపోయింది. ఒకవేళ ఈ ఇద్దరు తైపీ ప్లేయర్లను దాటి ముందుకెళ్తే సింధు నుంచి మరో గోల్డ్‌‌ ఆశించొచ్చు. 

శ్రీకాంత్‌‌, ప్రణీత్​ ఏం చేస్తారో
మెన్స్‌‌ సింగిల్స్‌‌లో చాన్నాళ్లుగా తన స్థాయికి తగ్గట్టు ఆడలేకపోతున్న కిడాంబి శ్రీకాంత్‌‌ 12వ సీడ్‌‌గా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.ఈ టోర్నీ కోసం స్పెయిన్‌‌ వెళ్లే క్రమంలో అతనికి వీసా సమస్యలు ఎదురయ్యాయి. ఫస్ట్‌‌ రౌండ్‌‌లో తను లోకల్‌‌ ప్లేయర్‌‌ పాబ్లో అబియన్‌‌తో పోటీ పడనున్నాడు. తొలి రెండు రౌండ్లు దాటితే ప్రిక్వార్టర్స్‌‌లో తనకు నాలుగో సీడ్‌‌ చౌ తైన్‌‌ చెన్‌‌తో సవాల్‌‌ ఎదురవనుంది. 14వ సీడ్‌‌గా బరిలో ఉన్న మరో తెలుగు షట్లర్‌‌ బి. సాయి ప్రణీత్‌‌ కూడా తన మార్కు చూపెట్టాలని చూస్తున్నాడు. 2019లో బ్రాంజ్​ నెగ్గిన ప్రణీత్​  ఫస్ట్‌‌ రౌండ్‌‌లో డచ్‌‌ ప్లేయర్‌‌ మార్క్‌‌ కల్జౌతో పోటీ పడున్నాడు. ఇంకో సీనియర్‌‌ హెచ్‌‌ఎస్‌‌ ప్రణయ్‌‌ ఫస్ట్‌‌ రౌండ్‌‌లోనే ఎనిమిదో సీడ్‌‌ అంగస్‌‌ను ఎదుర్కోనున్నాడు. ఈ మధ్య సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌ చేస్తున్న యంగ్‌‌ సెన్సేషన్‌‌ లక్ష్యసేన్‌‌కు ఫస్ట్ రౌండ్‌‌లో బై లభించింది. ఇక, మెన్స్‌‌ డబుల్స్‌‌లో ఎనిమిదో సీడ్‌‌ ఇండియన్‌‌ జోడీ సాత్విక్‌‌ సాయిరాజ్‌‌– చిరాగ్‌‌ షెట్టిపై అంచనాలున్నాయి. ఇండోనేసియాకు చెందిన రెండు టాప్‌‌ సీడ్‌‌ పెయిర్స్‌‌ లేకపోవడం వాళ్లకు ప్లస్‌‌ పాయింట్‌‌ కానుంది. ఫస్ట్ రౌండ్‌‌లో  సాత్విక్‌‌ జోడీకి బై లభించింది. సుమీత్‌‌ రెడ్డి–మను అత్రి, అరుణ్‌‌ జార్జ్‌‌–సన్యమ్‌‌ శుక్లా, అర్జున్‌‌–ధృవ్‌‌ జోడీలు కూడా బరిలో ఉండగా, విమెన్స్‌‌ డబుల్స్‌‌లో సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జంట అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.