బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ జూనియర్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో తన్వీకి సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌

బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ జూనియర్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో తన్వీకి సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌

గువాహటి: ఇండియా యంగ్‌‌‌‌ షట్లర్‌‌‌‌ తన్వీ శర్మ.. బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ జూనియర్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌కే పరిమితమైంది. ఆదివారం జరిగిన విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ఫైనల్లో టాప్‌‌‌‌సీడ్‌‌‌‌ తన్వీ 7–15, 12–15తో అన్యాపట్ ఫిచిట్ప్రీచసక్ (థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌) చేతిలో ఓడింది. 

28 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో ఇద్దరు షట్లర్లు పాయింట్ల కోసం గట్టిగానే పోరాడారు. 2–2, 4–4తో తొలి గేమ్‌‌‌‌ను మొదలుపెట్టారు. కానీ రిటర్న్‌‌‌‌ షాట్లలో తడబడిన తన్వీ అన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌ చేసింది. ఫలితంగా థాయ్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ 10–5 లీడ్‌‌‌‌లోకి వెళ్లింది. కానీ తన్వీ కొట్టిన రిటర్న్స్‌‌‌‌ నెట్‌‌‌‌ను తాకడంతో గేమ్‌‌‌‌ చేజారింది. రెండో గేమ్‌‌‌‌లో వ్యూహాత్మకంగా ఆడిన తన్వీ 6–1 లీడ్‌‌‌‌లో నిలిచింది. కానీ మళ్లీ నెట్‌‌‌‌ వద్ద తప్పులతో ప్రత్యర్థికి పుంజుకునే చాన్స్‌‌‌‌ ఇచ్చింది.