దేశంలో మళ్లీ ఎన్నికల హడావిడి

దేశంలో మళ్లీ ఎన్నికల హడావిడి
  • ఈ నెల 10న ఎన్నికలు.. 13న కౌంటింగ్‌

న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్‌ అధ్వర్యంలోని ఇండియా కూటమి మరోసారి ఎన్నికల్లో తలబడనున్నాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికలు ముగియగా, కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు చనిపోవడం, రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు బైపోల్‌ నిర్వహించనున్నారు. జులై 10న ఆయా రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనుండగా, జులై 13న కౌంటింగ్‌ చేయనున్నారు. 

రూపౌలి (బిహార్‌), రాయ్‌గంజ్‌, రణఘట్‌ దక్షిణ్‌, బాగ్దా, మానిక్తలా (పశ్చిమ బెంగాల్‌), విక్రవంది (తమిళనాడు), అమర్వారా (మధ్యప్రదేశ్‌), బద్రీనాథ్‌, మంగ్లార్‌‌ (ఉత్తరాఖండ్‌), జలంధర్‌‌ వెస్ట్‌ (పంజాబ్‌), డెహ్రా, హమిర్‌‌పూర్‌‌, నాలాఘర్‌‌ (హిమాచల్‌ ప్రదేశ్‌)లో ఎలక్షన్‌ జరగనున్నాయి.