గుర్తు తెలియని వాహనం ఢీకొని మెట్రో ఉద్యోగి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని మెట్రో ఉద్యోగి మృతి

హైదరాబాద్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మరణించిన ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగింది. శనివారం ఉదయం జాతీయ రహదారిపై డిగ్రీ కాలేజ్ సమీపంలో బైక్ ఓ వాహనం డీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న నాసిర్ షేక్(35) అక్కడికక్కడే ‌ మృతి చెందాడు. మృతుడు మెట్రో ఉద్యోగిగా గుర్తించిన పోలీసులు..డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం గాంధీ హస్పిటల్ కి తరలించారు. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో రోడ్డుపై ఎక్కువ జనాలు లేరని..రెండు బైక్ లు ఢీకొనగా..ఓ బైకర్ తప్పించుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే బైక్ ను ఢీకొట్టిన వాహనాన్ని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తిస్తున్నామని తెలిపిన పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.