హసన్‌పర్తి, వెలుగు: బైక్ను లారీ ఢీకొట్టిన ఘటనలో భార్యాభర్తలు మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండలం కేశవపూర్ గ్రామానికి చెందిన చల్ల బతుకయ్య(43), లక్ష్మి(40) దంపతులు హసన్‌పర్తిలో గిన్నెల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
శనివారం సాయంత్రం పనిమీద బైక్‌పై షాపు నుంచి హనుమకొండకు వెళ్తుండగా కరీంనగర్ నుంచి వస్తున్న లారీ వీరిని ఢీకొట్టింది. బతుకయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మీని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.
