- హెల్మెట్ పెట్టుకున్నా.. క్లిప్ పెట్టుకోకపోవడంతో తలకు తీవ్ర గాయం
బషీర్‌బాగ్, వెలుగు: బైక్ ఫ్లై ఓవర్‌పైనుంచి పడిన ఘటనలో సాఫ్ట్వేర్ఉద్యోగి మృతిచెందాడు. కాచిగూడ సీఐ జ్యోత్స, ఎస్ఐ భరత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణగూడకు చెందిన అశోక్ గుప్త కుమారుడు శిరీష్(33) పుణెలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు.
ఆదివారం అర్ధరాత్రి తన ఎలక్ట్రికల్ బైక్ పై గోల్నాక నుంచి రామంతాపూర్ లో ఉండే ఫ్రెండ్ వద్దకు వెళ్తున్నాడు. మార్గమధ్యలో అంబర్ పేట్ బ్రిడ్జిపై బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో శిరీష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
హెల్మెట్ సేఫ్టీ క్లిప్ పెట్టుకోకపోవడం వల్లే...
శిరీష్ హెల్మెట్‌కు సేఫ్టీ క్లిప్ పెట్టుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఎలక్ట్రిక్‌బైక్ ఫ్లై ఓవర్‌పై నుంచి కిందపడే సమయంలో అతని తలకు ఉన్న హెల్మెట్ఊడిపోయిందన్నారు. శిరీష్తల బలంగా రోడ్డుకు తగలడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయాడని పేర్కొన్నారు. ద్విచక్రవాహనాలపై వెళ్లేవారు హెల్మెట్తలకు తగిలించుకుంటే సరిపోదని తప్పకుండా సేఫ్టీ క్లిప్ పెట్టుకోవాలని సూచించారు. ఏదైనా ప్రమాదం జరిగితే గాయాలతో బయటపడే అవకాశం ఉంటుందని తెలిపారు.
