శ్రీశైలంలో వచ్చే నెల 7వ తేదీన శ్రీభ్రమరాంబాదేవికి వార్షిక కుంభోత్సవం నిర్వహించనున్న దేవస్థానం ప్రతి ఏడాది చైత్రమాసం పౌర్ణమి తర్వాత భ్రమరాంబాదేవికి వార్షిక కుంభోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఆలయంలో కుంభోత్సవ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో చైత్రమాసం వరకు వచ్చే ప్రతి శుక్రవారం,మంగళవారం అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.
వచ్చే నెల 7న కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో హారతి ఇవ్వనున్న ఉద్యోగి గోవిందు శ్రీస్వామివారి ఆలయంలో నుండి హారతి తీసుకొని తప్పెట్లతో ఘనంగా వెళ్లి అమ్మవారికి హారతి ఇచ్చారు. అదే సమయంలో అమ్మవారి సింహమండపం వద్ద కొబ్బరికాయలు రాసులుగా పోసి అర్చకులు,అధికారులు, స్థానిక భక్తులు సాత్వికబలిగా సమర్పించారు.
