న్యూఇయర్ ఈవెంట్స్..21 నుంచి పర్మిషన్స్..మాదాపూర్ డీసీపీ రితిరాజ్

న్యూఇయర్ ఈవెంట్స్..21 నుంచి పర్మిషన్స్..మాదాపూర్ డీసీపీ రితిరాజ్

గచ్చిబౌలి, వెలుగు: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించవద్దని, ఆర్గనైజర్లు డ్రగ్స్​కు అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని మాదాపూర్ జోన్ డీసీపీ రితిరాజ్ హెచ్చరించారు. సోమవారం గచ్చిబౌలి డీసీపీ ఆఫీస్​లో ఐటీ కారిడార్ పరిధిలోని ఈవెంట్ ఆర్గనైజర్లు, పోలీసులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఈవెంట్లలో అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా పాటించాలని, కెపాసిటీకి మించి ప్రజలను అనుమతించవద్దని, డీజే పాటలతో సౌండ్ పొల్యూషన్ చేయవద్దని సూచించారు. ఈవెంట్ల కోసం డిసెంబర్ 21 నుంచి సైబరాబాద్ పోలీస్ పర్మిషన్ మేనేజ్​మెంట్ సిస్టమ్​లో అప్లై చేసుకోవాలని తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఆర్గనైజర్లు, ప్రజలు సహకరించాలన్నారు. సమావేశంలో రంగారెడ్డి డీఎఫ్​వో, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్​స్పెక్టర్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు పాల్గొన్నారు.