
కోల్‌కతా: కొన్నాళ్లుగా నిలిచిపోయిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) తిరిగి అమలు చేసే దిశగా కేంద్ర సర్కార్ చర్యలు చేపడుతున్నట్లే కనిపిస్తోంది. బీజేపీ సీనియర్ నేత కైలాష్ విజయ్‌వర్గియా చేసిన కామెంట్స్ దీనికి ఊతమిస్తున్నాయి. వచ్చే నెల నుంచి బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల నుంచి వచ్చిన శరణార్థులకు కేంద్రం పౌరసత్వం ఇవ్వడం షురూ చేస్తుందని కైలాష్ అన్నారు. ‘వచ్చే ఏడాది జనవరి నుంచి సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సీఏఏ) కింద శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ మొదలవుతుందని ఆశిస్తున్నాం. పొరుగు దేశాల్లో హింసకు గురైన శరణార్థులకు పౌరసత్వాన్ని ఇవ్వాలనే సంకల్పంతోనే సీఏఏను కేంద్రం ఆమోదించింది’ అని కైలాష్ పేర్కొన్నారు.