
న్యూఢిల్లీ: సిటిజన్‌షిప్ అమెండెమెంట్ యాక్ట్ (సీఏఏ) అమలుకు మరో ఆరు నెలల సమయం పడుతుందని పార్లమెంట్‌కు కేంద్రం తెలిపింది. సీఏఏకి సంబంధించి అవసరమైన మరిన్ని రూల్స్ రూపొందించడానికి టైమ్ పడుతుందని హోం మినిస్ట్రీ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సీ)ను అమలు చేయడంపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని చెప్పింది. దీనికి ఓకే చెప్పిన లోక్‌సభ కమిటీ.. ఈ ఏడాది ఏప్రిల్ 9 వరకు చట్టాలను అమలు చేయాలని చెప్పగా.. ఈ సంవత్సరం జూలై 9లోపు చట్టాలను అమలు చేయాలని రాజ్యసభ సూచించింది. లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు గాను మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ పైవిధంగా సమాధానం రాసి కమిటీకి పంపింది.