
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్‌కర్నూల్, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో కొత్తగా ఈ మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో ప్రజలకు స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. గతంలోనే సీఎం కేసీఆర్ మహబూబాబాద్, జగిత్యాల జిల్లాలకు మెడికల్ కాలేజీలు కేటాయిస్తామని ప్రకటించగా ఎట్టకేలకు ఇవాళ్టి కేబినెట్ లో ఆమోదించారు.