2023 డిసెంబర్ వరకు ఉచిత రేషన్

2023 డిసెంబర్ వరకు ఉచిత రేషన్

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ పలు కీలకనిర్ణయాలు తీసుకుంది. 2019 జులై 1 నుంచి వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కింద సాయుధ దళాల పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్ల బకాయిలు చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో 25 లక్షల 13 వేల మందికి లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలిపారు. 2014 జులై 1 వరకు మొత్తం 20 లక్షల 60వేల మంది పెన్షనర్లు ఉన్నారని ఠాగూర్ తెలిపారు. 

ఇటు ఉచిత రేషన్ పథకాన్ని పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ వరకు ఉచిత రేషన్ పథకాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకంతో 83కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుందని చెప్పింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్‌ను ఉచితంగా అందించాలంటే దాదాపు  2 లక్షల కోట్లు ఖర్చవుతుందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు.