ఎయిర్​పోర్ట్​కు మహర్షి వాల్మీకి పేరు

ఎయిర్​పోర్ట్​కు మహర్షి వాల్మీకి పేరు

న్యూఢిల్లీ :  అయోధ్య ఎయిర్​పోర్టుకు మహర్షి వాల్మీకి పేరు పెట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం జరిగింది. అలాగే విమానాశ్రయాన్ని  ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టుగా ప్రకటించనున్నారు. గతేడాది డిసెంబర్ 30న మోదీ ఈ ఎయిర్​పోర్టును ప్రారంభించారు.

‘‘అయోధ్య విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్, అయోధ్యధామ్’ పేరు పెట్టడం ఆ మహర్షికి నివాళి. ఆ మహనీయుని పేరుతో దానికి సాంస్కృతిక గుర్తింపు దక్కింది. అలాగే ఈ నగరం చారిత్రక ప్రాముఖ్యతకు అనుగుణంగా ఉంటుంది” అని ప్రభుత్వం పేర్కొంది. ఇంటర్నేషనల్​ ఎయిర్ పోర్ట్​తో అయోధ్య ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి  జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్​ చేశారు.