మార్చి వరకు ఉచిత రేషన్ బియ్యం

మార్చి వరకు  ఉచిత రేషన్ బియ్యం

ఉచిత రేషన్ బియ్యం పథకాన్ని మార్చి వరకు పెంచుతూ కేంద్ర కెబినెట్ నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను అనురాగ్ ఠాకూక్ వివరించారు. వ్యవసాయ చట్టాల రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ చట్టాల ఉప సంహరణ బిల్లును పెడుతామన్నారు. అలాగే మార్చి 2022 వరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ కూడా కొనసాగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై రూ. 53,344.52 కోట్ల ఆర్థిక భారం పడనుందని..ఈ విడతలో 163 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు విడుదల కానున్నట్లు తెలిపింది. ప్రతివ్యక్తికి  కేంద్రం ప్రతి నెలా 5 కేజీల ఆహారధాన్యాలు ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే.