పుదుచ్చేరీలో 50 రోజుల తర్వాత ఏర్పడ్డ కేబినెట్

పుదుచ్చేరీలో  50 రోజుల తర్వాత  ఏర్పడ్డ కేబినెట్

పుదుచ్చేరీలో మంత్రివర్గం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా N రంగస్వామి ప్రమాణం చేసిన దాదాపు 50 రోజుల తర్వాత కేబినెట్ ఏర్పాటు చేశారు. ఐదుగురు మంత్రులు ప్రమాణం చేయగా... అందులో BJP నుంచి ఇద్దరు, ఆల్ ఇండియా NR కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఉన్నారు. వీరితో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రమాణం చేయించారు. బీజేపీ నుంచి నమశివాయన్, సాయి శరవణన్ కుమార్ లకు మంత్రవర్గంలో చోటు దక్కింది. నమశివాయన్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీడి బీజేపీ లో చేరారు. NR కాంగ్రెస్ నుంచి లక్ష్మీ నారాయణన్, డెజా కోమార్, చండీరా ప్రియాంక మంత్రులుగా ప్రమాణం చేశారు. చండీరా ప్రియాంక పుదుచ్చేరీ చరిత్రలోనే మొదటి మహిళా మంత్రిగా రికార్డ్ క్రియేట్ చేశారు.