ఆగస్టు 29న కేబినెట్ భేటీ..సర్పంచ్ ఎన్నికలపై క్లారిటీ వచ్చేది అపుడే..

ఆగస్టు 29న కేబినెట్ భేటీ..సర్పంచ్ ఎన్నికలపై క్లారిటీ వచ్చేది అపుడే..

తెలంగాణ కేబినెట్ సమావేశం ఆగస్టు 29న మద్యాహ్నం 3:30గంటలకు జరగనుంది. సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. బీసీ రిజర్వేషన్లు, అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారు, సర్పంచ్ ఎన్నికలు,కాళేశ్వరం నివేదికపై  ప్రధానంగా ఈ భేటీలో చర్చించనున్నారు.  

 ముఖ్యంగా అందరు ఎదురు చూస్తోన్న పంచాయతీ ఎన్నికల నిర్వాహణపై ఈ కేబినెట్ భేటీలో  క్లారిటీ రానుంది. సెప్టెంబర్ 30 లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలపై స్పష్టత కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.  

 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లు, పంచాయతీ రాజ్​చట్ట సవరణ ఆర్డినెన్స్​కేంద్రం వద్ద పెండింగ్‎లో ఉండటంతో రిజర్వేషన్లపై  ఇప్పటికే న్యాయ నిపుణుల సలహా తీసుకుంది సబ్  కమిటీ.  ఆగస్టు 28 లోపు ప్రభుత్వానికి  రిపోర్ట్  ఇవ్వనుంది . సబ్ కమిటీ ఇచ్చే నివేదికపై కేబినెట్ లో చర్చించి..   స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం . 

మరో వైపు కాళేశ్వరం అవకతవకలపై ఏర్పాటు చేసిన  జిస్టిస్ పీసీ ఘోష్  కమిషన్  రిపోర్ట్ పై  అసెంబ్లీలో చర్చిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల తేది ఖరారు చేయనుంది కేబినెట్ భేటీ.