కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో .. హుండీ ఆదాయం లెక్కింపు

 కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో .. హుండీ ఆదాయం లెక్కింపు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో ఆదివారం బుకింగ్ ఆదాయం రూ.45,62, 032 వచ్చిందని మంగళవారం ఆలయ అధికారులు తెలిపారు. శనివారం రూ.4,18,673, ఆదివారం రూ.37,47,172, సోమవారం రూ.3,96,187 ఆదాయం వచ్చిందన్నారు. స్వామివారికి భక్తులు వివిధ రకాల మొక్కులు, దర్శనాలు, ప్రసాదం, పట్నాలు, బోనాలు, టికెట్ల అమ్మకాల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు ఆలయ బుకింగ్ ఇన్‌‌చార్జి అధికారి నర్సింహులు తెలిపారు.

బోరంచ ఆలయంలో హుండీ లెక్కింపు

నారాయణ్ ఖేడ్: ఖేడ్ నియోజకవర్గం మనూర్ మండలంలోని బోరంచ గ్రామంలో మంగళవారం నల్ల పోచమ్మ తల్లి ఆలయ హుండీ లెక్కింపు చేపట్టారు. మొత్తం రూ.7,71, 618 ఆదాయం వచ్చినట్లు ఈవో మోహన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, పురోహితులు, పోలీసులు,  గ్రామస్తులు  పాల్గొన్నారు.