తహవుర్ రాణాను ఇండియాకు అప్పగించనున్న యూఎస్

తహవుర్ రాణాను ఇండియాకు అప్పగించనున్న యూఎస్

న్యూఢిల్లీ : 26/11 ముంబై దాడుల(2008 ముంబై టెర్రర్ అటాక్) కేసు ప్రధాన నిందితుల్లో ఒకడైన తహవుర్ హుస్సేన్ రాణాను ఇండియాకు అప్పగించేందుకు అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు అంగీకరించింది. ఇండియా, అమెరికా మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడియన్ వ్యాపారవేత్త అయిన తహవుర్ రాణా.. 2008లో జరిగిన ముంబై దాడులకు ఆర్థిక సాయం చేసినట్లు ఎన్ఐఏ తేల్చింది.

ప్రస్తుతం అమెరికా పోలీసుల అదుపులో ఉన్న రాణాను అప్పగించాలని అమెరికాను కేంద్రం 2020లో కోరింది. దీనికి ప్రెసిడెంట్ బైడెన్ ప్రభుత్వం ఆమోదం తెలిపి, ఈ విషయాన్ని పరిశీలించాలని  కాలిఫోర్నియా కోర్టును కోరింది.  కోర్టు ఈ మేరకు రాణాను అప్పగించాలని ఆదేశించింది. కాగా, 2008 నవంబర్  26న జరిగిన ముంబై టెర్రర్ అటాక్ లో  ఆరుగురు అమెరికన్లు సహా మొత్తం166 మంది చనిపోయారు.