కాలిఫోర్నియాలో మొదటి సునామీ ప్రభావం..పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న అలలు

కాలిఫోర్నియాలో మొదటి సునామీ ప్రభావం..పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న అలలు

రష్యాలో భూకంపం తర్వాత పసిఫిక్ రీజియన్ లో సునామి హెచ్చరికలు జారీ అయ్యాయి.  2011 తర్వాత ప్రపంచంలోనే అత్యంత బలమైన భూకంపాలలో ఒకటి బుధవారం(జూలై 30)  తెల్లవారుజామున రష్యాలోని ఫార్ ఈస్ట్‌ను తాకింది. 8.8 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం కమ్చట్కా ద్వీపకల్పాన్ని కుదిపేసింది.ఉత్తర పసిఫిక్ అంతటా సునామీ వార్నింగ్ జారీ చేసింది. 1952 తర్వాత ఈ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన భూకంపం తరువాత అంతకంటే తీవ్రమైన ప్రకంపనలు సంభవించాయి.భూకంప శాస్త్రవేత్తలు రాబోయే వారాల్లో 7.5 తీవ్రతతో మరిన్ని ప్రకంపనలు సంభవించవచ్చని హెచ్చరించారు. 

రష్యాలో భూకంపంతో పసిఫిక్ రీజియన్ లో సునామి హెచ్చరికలు జారీ అయ్యాయి. కాలిఫోర్నియాలో మొదటి సునామీ ప్రభావం కనిపింది. పెద్ద ఎత్తునఅలలు ఎగిసిపడుతున్నాయి. ఉత్తర కురిల్స్క్‌ను సునామీ అల తాకింది. ఇది నివాస ప్రాంతాలను ,స్థానిక ఫిషింగ్ హార్బర్ ను ముంచెత్తింది. కమ్చట్కా, కురిల్ దీవులు ,జపాన్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రజలను సురక్షి ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే అలాస్కా, హవాయి,న్యూజిలాండ్ వరకు సునామీ సైరన్‌లు వినిపించాయి.