కరోనా టెస్ట్‌‌కు ఎక్కువ చార్జ్​ చేస్తే 104 ​కు కాల్​చేయండి

కరోనా టెస్ట్‌‌కు ఎక్కువ చార్జ్​ చేస్తే 104 ​కు  కాల్​చేయండి

హైదరాబాద్, వెలుగు: కరోనా టెస్టులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువగా చార్జ్ చేసే ల్యాబులపై తమకు ఫిర్యాదు చేయాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌, డాక్టర్‌‌ శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. ల్యాబు దగ్గరకు వెళ్లి టెస్ట్‌ చేయించుకుంటే రూ.2200, ఇంటి దగ్గరకు వచ్చి శాంపిల్ తీసుకెళ్తే రూ.2800 మాత్రమే చెల్లించాలన్నారు. అంతకంటే ఎక్కువ వసూలు చేస్తే 104 నంబర్‌ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. idsptelangana@yahoo.com లో ఫిర్యాదు చేసినా సంబంధిత ల్యాబ్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ఫిక్స్‌ చేసిన చార్జ్​లే తీసుకోవాలని ల్యాబ్ యాజమాన్యాలకు ఆయన సూచిస్తూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

సరిహద్దులో యుద్ధ విమానాలు